APPSC: 92 గ్రూప్‌-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో ఎట్టకేలకు గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 92 గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 30 Sep 2022 22:36 IST

అమరావతి: ఏపీలో ఎట్టకేలకు గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 92 గ్రూప్‌-1 ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 13 నుంచి నవంబర్‌ 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రవాణాశాఖలో 17 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి నవంబర్‌ 2 నుంచి 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌  http://psc.ap.gov.inలో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని