Narayana: సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులు రద్దు: మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై చిత్తూరు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. 

Published : 06 Dec 2022 16:43 IST

అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై చిత్తూరు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ విచారించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెషన్స్‌ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నారాయణకు చిత్తూరు మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను గత నెల 30న సెషన్స్‌ కోర్టు రద్దు చేసింది. కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను మాజీ మంత్రి నారాయణ సవాల్‌ చేయగా.. సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని