KCR: భారాస అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైలు రోకో కేసులో.. తదుపరి ఉత్తర్వుల వరకూ విచారణపై స్టే విధించింది.

Updated : 25 Jun 2024 15:27 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైలు రోకో కేసులో.. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకూ విచారణపై కోర్టు స్టే విధించింది. విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసి.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 2011లో రైలురోకోకు కేసీఆర్‌ పిలుపునివ్వడంతో కేసు నమోదైంది. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసు కొట్టివేయాలని కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌పై హైకోర్టుకు..

మరోవైపు తెలంగాణలో జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషన్‌ ఏర్పాటు సహజన్యాయ సూత్రాలకు విరుద్దమని.. నిబంధనల మేరకే విద్యుత్‌ కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. జస్టిస్‌ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన పిటిషన్‌లో వెల్లడించారు. విద్యుత్‌ కమిషన్‌, జస్టిస్‌ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని ప్రతివాదులుగా చేర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని