Remdesivir: బ్లాక్‌లో రూ.10వేలు!

అధిక ధరకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తు్న్న ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బందిని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

Published : 20 Apr 2021 01:15 IST

పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు

విశాఖ: అధిక ధరకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బందిని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి చెందిన ఓ నర్సు.. హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది ద్వారా బయట వ్యక్తులకు వీటిని అమ్ముతుండగా విజిలెన్స్‌ సిబ్బంది పట్టుబడ్డారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.10వేలకు విక్రయిస్తుండగా దొరికారు. ఈ వ్యవహారంలో నర్సు, హౌస్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌, మేనేజర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సికింద్రాబాద్‌లోనూ రెమ్‌డిసివర్‌ ఇంజెక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని