Erectile Dysfunction: స్తంభన లోపాన్ని అధిగమించండిలా..!

తనువులు, మనసులను ఏకం చేసే సృష్ఠి కార్యంలో పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. కుటుంబాల్లో కలతలు, వివాదాలు ముదురుతున్నాయి. చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. స్తంభన వైఫల్యం కట్టిపడేయడానికి ఎన్నో అవకాశాలున్నా వైద్యులకు చెప్పుకోలేక లోలోపలే మదనపడిపోతున్నారు.

Updated : 24 Sep 2022 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనువులు, మనసులను ఏకం చేసే సృష్ఠి కార్యంలో పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. కుటుంబాల్లో కలతలు, వివాదాలు ముదురుతున్నాయి. చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. స్తంభన వైఫల్యం కట్టిపడేయడానికి ఎన్నో అవకాశాలున్నా వైద్యులకు చెప్పుకోలేక లోలోపలే మధనపడిపోతున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చో వైద్యులు పలు సూచనలు చేశారు.

* స్తంభన లోపం అరుదైనది కాదు. మూడింట ఒక వంతు మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 

* ఈ ఇబ్బంది నుంచి బయట పడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈ విషయం తెలియక సతమతమవుతున్నారు.

* అంగ స్తంభన సమస్య గుండె, మధుమేహం ఇతరత్రా జబ్బులున్నపుడు వస్తుంది.

*  జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆందోళన టెస్టోస్టెరాన్‌ మోతాదులు తగ్గడంతో స్తంభన లోపం ఎదురవుతుంది.

* వైద్యులను కలుసుకొని అన్ని విషయాలను విడమరచి చెప్పడం మంచిది. 

* అనారోగ్యకరమైన ఆహారం ఇబ్బందులను మరింత ఎక్కువ చేస్తుంది. ఈ సమస్య వచ్చినపుడు మంచి ఆహారంపై దృష్టి పెట్టాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పొట్టు తీయని పదార్థాలు ఎక్కువగా తినాలి.

* వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి రక్త సరఫరా పెంచుతుంది. ఈత, యోగా, ప్రాణాయామం బాగా ఉపకరిస్తాయి.

* పొగ, మద్యం తాగడం మానేయాలి. ఇవి సమస్యను మరింత పెద్దగా చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని