Balasubrahmanyam: గుంటూరులో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్రహం తొలగింపుతో వివాదం చోటు చేసుకుంది. గుంటూరులోని మదర్‌ థెరీసా కూడలిలో కళా దర్బార్‌ అధ్వర్యంలో  ఏర్పాటు చేసిన విగ్రహానికి అనుమతి లేదంటూ..నగరపాలక సంస్థ అధికారులు తొలగించేశారు.

Published : 04 Oct 2022 01:11 IST

గుంటూరు: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్రహం తొలగింపుతో వివాదం చోటు చేసుకుంది. గుంటూరులోని మదర్‌ థెరీసా కూడలిలో కళా దర్బార్‌ అధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేదంటూ నగరపాలక సంస్థ అధికారులు దానిని తొలగించేశారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరుతూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగామని కళాదర్బార్‌ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు అన్నారు. ‘‘ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు తొలగించారు?. మహా గాయకుడికి కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేసింది కేవలం గుంటూరు లోనేనని ఆయన చెప్పారు. గుంటూరులో దాదాపు 200పైగా అనుమతి లేని విగ్రహాలున్నాయని ఆయన అన్నారు. తిరిగి బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని