Republic Day: ప్రగతిభవన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం కేసీఆర్‌

74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Published : 26 Jan 2023 11:15 IST

హైదరాబాద్‌: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు.

అంతకుముందు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని అమర జవానుల స్తూపం వద్ద కేసీఆర్‌ నివాళులర్పించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మల్లారెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్‌ రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు