
sky lift: నానక్‌రాంగూడ అగ్నిప్రమాదం.. 14మందిని కాపాడిన ‘బాహుబలి’ క్రేన్ ఇదే..
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలకు అధికారులు బ్రాంటో స్కైలిఫ్ట్ (brontoskylift)ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. సకాలంలో దీన్ని తీసుకురావడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. భవనంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో భయంతో టెర్రస్‌పై చిక్కుకున్న 14మందిని కాపాడటంలో ఈ స్కైలిఫ్ట్ కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ స్కై లిఫ్ట్ క్రేన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భారీ క్రేన్(బాహుబలి క్రేన్)తో భవనం అద్దాలు పగలగొట్టడం, టెర్రస్‌పై చిక్కుకున్న వారిని కిందకు దించడం వంటివి చుట్టుపక్కల ఉన్నవారంతా ఎంతో ఆసక్తిగా గమనించారు. అయితే, ఈ బ్రాంటో స్కైలిఫ్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కొనుగోలు చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల (అద్దాల మేడలు) భవనాలు పెరగడంతో భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫిన్లాండ్ నుంచి రెండు భారీ స్కైలిఫ్ట్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. మాదాపూర్, సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రాల్లో ఈ బ్రాంటో స్కైలిఫ్ట్‌లను ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. దాదాపు 54 మీటర్ల ఎత్తు.. 18 అంతస్తుల వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగలిగే సమర్థత దీనికి ఉంటుందని తెలిపారు. దీన్ని ఆపరేట్ చేయడం కూడా అంత కష్టమేమీ కాదని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pak Economic Crisis: దాయాది దేశం.. మరో శ్రీలంక కానుందా..?
-
India News
Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
-
Sports News
IND vs ENG: అండర్సన్ vs కోహ్లీ.. ఇదే చివరి పోరా?
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్