Pinnelli: వైకాపా నేత పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. 

Published : 20 Jun 2024 16:17 IST

అమరావతి: వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. గతంలో ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ కొన్ని షరతులు విధించింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని