ఈ నెల 18న వైద్యుల దేశవ్యాప్త నిరసన: ఐఎంఏ

బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా‘సేవ్‌ ది సేవియర్‌’నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న ఆందోళన చేపట్టనున్నట్టు ఐమ్‌ఏ వెల్లడించింది.

Published : 12 Jun 2021 20:30 IST

ప్రాణదాతల రక్షణ బాధ్యత కేంద్రానిదేనన్న భారత వైద్యమండలి

దిల్లీ: బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్‌ ది సేవియర్‌’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న ఆందోళన చేపట్టనున్నట్టు ఐఎంఏ వెల్లడించింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నల్లటి వస్త్రాలు, మాస్కులు, బ్యాడ్జీలను ధరించి నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.  శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆ రోజు ఆసుపత్రులు పని చేస్తాయని తెలిపింది. వైద్యులు సహా ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నియంత్రణకు కఠిన చట్టాలను రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ప్రాణదాతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై జరిగిన అమానుష దాడుల గురించి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో వైరస్‌ సోకి దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వెల్లడించింది.  బిహార్‌లోనే ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలిపింది.  

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని