
Happy Birthday: అంధురాలి బర్త్‌డేకు రెస్టారెంట్ ఊహించని గిఫ్ట్.. అదేంటో చూశారా?
ఇంటర్నెట్ డెస్క్: కస్టమర్లను ఆకర్షించడానికే రెస్టారెంట్లు ఎల్లప్పుడు కొత్తగా ప్రయత్నిస్తాయి. టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరికొత్త పద్ధతిలో ముందుకు వెళ్తాయి. రెస్టారెంట్లకు వచ్చే అతిథులను నిత్యం ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ ఉంటాయి. తాజాగా లండన్‌లోని ఓ రెస్టారెంట్ అలాగే వినూత్నంగా ఆలోచించింది. అంధురాలి బర్త్‌డేకు సర్ప్రైజ్గా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను చిత్రీకరించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అంధురాలైన ఓ అమ్మాయి తన పుట్టినరోజున రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపి ఆమెను ఆశ్చర్యపరిచారు. ఒక ప్లేట్లో కరిగిన చాక్లెట్‌తో ‘హ్యపీ బర్త్‌డే’ అని బ్రెయిలీలో రాశారు. ఆ ప్లేట్‌ను ఆమె ముందు పెట్టారు. ఆమె వాటిని తాకుతూ తెగ సంబర పడిపోయింది. ‘నాకు శుభాకాంక్షలు తెలిపారు. యూ గాయ్స్ ఆర్ అమేజింగ్’ అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 48 సెకన్లు ఉన్న ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 60లక్షలకు పైగా మంది వీక్షించారు. ప్రతి ఒక్కరి మనసును హత్తుకునే విధంగా ఉన్న వీడియోను చూసి నెటిజన్లు కామెంట్ల చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.