Ts News: వేములవాడ రాజన్న ఆలయంలో కొవిడ్ ఆంక్షలు..

తెలంగాణలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 13న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున...

Updated : 11 Jan 2022 15:08 IST

సిరిసిల్ల‌: తెలంగాణలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 13న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఆలయంలో కొవిడ్‌ ఆంక్షలు విధించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. స్వామివారికి ఏకాంతంగా పూజలు చేయనున్నట్లు తెలిపారు. పరిమిత సంఖ్యలో వేదపండితులు, అర్చకులతో స్వామివారికి ఏకాంత సేవలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు