Telangana News: ఆ ఆటోలకు హైదరాబాద్‌లో ప్రవేశం లేదు: ట్రాఫిక్‌ పోలీసులు

ఇతర జిల్లాల్లో రిజస్టరైన ఆటోలకు హైదరాబాద్‌ నగరంలో ప్రవేశం లేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Updated : 28 Feb 2022 13:19 IST

హైదరాబాద్‌: ఇతర జిల్లాల్లో రిజిస్టరైన ఆటోలకు హైదరాబాద్‌ నగరంలో ప్రవేశం లేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్‌లో రిజిస్టరైన ఆటోలే నగరంలో తిరిగేందుకు అనుమతి ఉన్నట్లు చెప్పారు. అలా కాకుండా ఇతర జిల్లాల ఆటోలు కనిపిస్తే సీజ్‌ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే ఆటో సంఘాలు, ఓలా, ఉబర్‌ సంస్థలకు ఈ మేరకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. నగరంలో ఆటోలు పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని