Andhra News: పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై పరిమితులు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై పరిమితులు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిమాండుకు అనుగుణంగా పరిశ్రమలు ఇవాళ్టి నుంచి  విద్యుత్‌ను

Published : 19 May 2022 00:44 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై పరిమితులు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిమాండుకు అనుగుణంగా పరిశ్రమలు ఇవాళ్టి నుంచి  విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఇప్పటివరకు 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి మాత్రమే అనుమతించిన డిస్కమ్‌లు ఇక నుంచి పూర్తిస్థాయిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్రంలోని పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై పరిమితులు ఏమీ ఉండబోవని ఏపీ ఇంధన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తాయని ప్రభుత్వం తెలిపింది.

మే 9వ తేదీన పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా 50 శాతం విద్యుత్ వినియోగాన్ని 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గడం, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులోకి రావటంతో పరిశ్రమలకు పూర్తిస్థాయి విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు ఇంధన శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు పెరుగుతున్నట్టు ఇంధన శాఖ వెల్లడించింది. 12 నుంచి 17 రోజుల నిల్వలు పెట్టుకోవాల్సిందిగా విద్యుత్‌ సంస్థలకు సూచనలు జారీ చేసింది. ఏపీ జెన్‌కో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకు టెండర్లు పిలిచిందని.. మొత్తం 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు ఇంధన శాఖ తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు