Visakhapatnam: 100 సార్లు రక్తదానం చేసిన విశ్రాంత అధ్యాపకుడు

ప్రాణాపాయ సమయంలో ఎవరికైనా రక్తం కావాలంటే.. ఇచ్చేందుకు ముందుంటారాయన. ఆరు పదుల వయసులోనూ..

Published : 21 Dec 2021 14:43 IST

విశాఖపట్నం: ప్రాణాపాయ సమయంలో ఎవరికైనా రక్తం కావాలంటే.. ఇచ్చేందుకు ముందుంటారాయన. ఆరు పదుల వయసులోనూ.. తోటివారి ప్రాణం నిలిపేందుకు సిద్ధమవుతారు. వందోసారి రక్తదానం చేసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు విశాఖ నగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు రమణమూర్తి.డాక్టర్‌ పిళ్లా రమణమూర్తి సంస్కృత అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. విద్యాదానంతోపాటు.. రక్తదానం అవసరాన్ని చాటుతున్నారు. వందోసారి రక్తదానం చేసిన అతి కొద్దిమంది వ్యక్తుల జాబితాలో ఆయన చేరారు. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశం.. రక్తదానం ద్వారా ప్రతి ఒక్కరికీ ఉందనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసమే తనను రక్తదానం చేయడానికి స్ఫూర్తినిస్తోందని రమణమూర్తి చెబుతున్నారు. శారీరక వ్యాయామం, నియమబద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తదానం చేసేందుకు వీలవుతోందని పేర్కొన్నారు. 100 సార్లు రక్తదానం చేసి యువతరానికి రమణమూర్తి ఆదర్శంగా నిలుస్తున్నారంటూ పలువురు కొనియాడారు. వందోసారి రక్తదానం చేయడాన్ని ఓ ఉత్సవంగా నిర్వహించి ఆయన్ను సత్కరించారు. సామాజిక బాధ్యత వైపు యువత దృష్టి పెట్టేలా రమణమూర్తి ఆచరణాత్మకంగా అనుసరిస్తున్న విధానాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని