Telangana News: సమ్మక్క-సారలమ్మను చినజీయర్‌ స్వామి అవమానించారు: రేవంత్‌రెడ్డి

వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీక అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అలాంటి వారిని చినజీయర్‌ స్వామి అవమానించారని

Published : 18 Mar 2022 15:06 IST

హైదరాబాద్: వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీక అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అలాంటి వారిని చినజీయర్‌ స్వామి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి ఆగమశాస్త్ర సలహాదారుడిగా చినజీయర్‌ను వెంటనే తప్పించాలన్నారు. ప్రజల భక్తి, విశ్వాసాలపై దాడి చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యాలయాన్ని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని