రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్ల బదిలీ

రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వే, భూ రికార్డుల జాయింట్‌ డైరెక్టర్‌గా కె.విద్యాసాగర్‌ను నియమించింది. విద్యాసాగర్‌కు సీఎస్‌ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై బాధ్యతలు అప్పగించింది. సీసీఎల్‌ అసిస్టెంట్‌

Updated : 28 Mar 2021 04:10 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వే, భూ రికార్డుల జాయింట్‌ డైరెక్టర్‌గా కె.విద్యాసాగర్‌ను నియమించింది. విద్యాసాగర్‌కు సీఎస్‌ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై బాధ్యతలు అప్పగించింది. సీసీఎల్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా కె.ఆదిలక్ష్మీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పాలనాధికారిగా కె.చంద్రమోహన్‌, హైదరాబాద్‌ ఆర్డీవోగా జి.వెంకటేశ్వర్లు, నర్సాపూర్‌ ఆర్డీవోగా సీహెచ్‌ రవీందర్‌రెడ్డి, మంచిర్యాల ఆర్డీవోగా డి.వేణు, నారాయణపేట ఆర్డీవోగా సీహెచ్‌ వెంకటేశ్వర్లు, స్టేషన్‌ ఘనపూర్‌ ఆర్డీవోగా కె.కృష్ణవేణి, భద్రాచలం మొబైల్‌ కోర్టు సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌గా కె.అనిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని