Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్‌ సెక్రటరీలకు రివర్షన్‌

సచివాలయంలోని కొందరు సెక్షన్‌ అధికారులకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా కల్పించిన పదోన్నతుల్ని వెనక్కు తీసుకున్న ప్రభుత్వం వారిని ఇన్‌ఛార్జిలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Published : 27 Sep 2023 22:15 IST

అమరావతి: సచివాలయంలోని కొందరు సెక్షన్‌ అధికారులకు అసిస్టెంట్‌ సెక్రటరీలుగా కల్పించిన పదోన్నతుల్ని వెనక్కు తీసుకున్న ప్రభుత్వం వారిని ఇన్‌ఛార్జిలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అసిస్టెంట్‌ సెక్రటరీల నుంచి రివర్షన్‌ పొందిన 50మంది సెక్షన్‌ ఆఫీసర్లను ఇన్ఛార్జిలుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

రివర్షన్‌ పొందిన వారిని ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ సెక్రటరీలుగా నియమిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో సెక్షన్ అధికారులకు ఇచ్చిన పదోన్నతుల్ని ప్రభుత్వం రివర్షన్‌ చేసింది. మరోవైపు తాత్కాలిక ఇన్‌ఛార్జి సెక్రటరీలుగా కొనసాగుతున్న వారికి సెక్షన్‌ ఆఫీసర్ల పేస్కేలు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హైకోర్టు తుది ఉత్తర్వుల మేరకే ఇన్‌ఛార్జి అసిస్టెంట్ సెక్రటరీల భాద్యతలు ఉంటాయని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గతంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించేందుకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం రివర్షన్ పొందిన వారందరి సర్వీసును ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని