Tomato Price: ఠారెత్తిస్తున్న టమాటా ధర.. రైతు బజార్ల ద్వారా విక్రయించాలని మార్కెటింగ్‌శాఖ నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలపై మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించారు.

Published : 18 Jun 2024 18:09 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలపై మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.55 నుంచి రూ.65 పలుకుతుండగా.. రైతు బజారులో కిలో రూ.54 ఉందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో టమాటా సాగు లేకపోవడం, చిత్తూరు జిల్లాలో మాత్రమే ఉత్పత్తి కారణంగా డిమాండ్‌ పెరిగినట్టు వెల్లడించారు. వర్షాల ప్రభావంతోనూ ధర పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా చిత్తూరు జిల్లాలోని మార్కెట్ల నుంచి టమాటా కొనుగోలు చేసి .. రైతు బజార్లలో విక్రయించాలని నిర్ణయించారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని మార్కెట్ల నుంచి దాదాపు 30 టన్నుల టమాటా కొనుగోలు చేసి గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని రైతు బజార్ల ద్వారా కొనుగోలు ధరలకే విక్రయించనున్నట్టు చెప్పారు. టమాటా కొనుగోళ్ల కోసం ప్రతి జిల్లా అధికారి ఆధీనంలో రూ.5లక్షలతో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినట్టు మార్కెటింగ్‌ శాఖ సీఈవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు