RGUKT-Basara: మూడో రోజూ కొనసాగిన నిరసన.. మద్దతుగా వచ్చిన కుటుంబ సభ్యుల అరెస్ట్‌

నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు నిరసన మూడో రోజు కొనసాగింది. విద్యార్థులు ప్రధాన గేటు వద్దకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు

Updated : 16 Jun 2022 10:53 IST

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లాలోని బాసర(Basara) ఆర్జీయూకేటీ(RGUKT) విద్యార్థుల నిరసన మూడో రోజు కొనసాగింది. విద్యార్థులు ప్రధాన గేటు వద్దకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ రెండో గేటు వద్దకు వెళ్లి బైఠాయించారు. మరోవైపు మద్దతుగా వచ్చిన విద్యార్థుల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

విద్యార్థులవి సిల్లీ డిమాండ్స్‌ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో.. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ భరోసా కల్పించినా ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. మూడు రోజులుగా ఎనిమిది వేల మంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే సీఎం కేసీఆర్‌ స్పందన కరవైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధానమైన 12 సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని