Andhra news: ఏపీలో తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు

తెలుగుదేశం ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది.

Published : 17 Jun 2024 20:14 IST

అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఏడాదిగా పేదలకు కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈనెల 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయడం లేదన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. సత్వరమే సరఫరా చేయాలని ఆదేశించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. 

రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పంపించారు. ఈనెల 20 నుంచి రేషన్‌ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్‌ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లోకి వచ్చిన చక్కెర, కందిపప్పు నాణ్యతతోపాటు అక్కడికి చేరిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. వచ్చే నెల 1 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని