వీడియో రికార్డింగ్‌ కానున్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ

Published : 17 Aug 2020 14:46 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రయోగాత్మక‌ ప్రాజెక్టుగా 20 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్‌ ప్రక్రియను చేపట్టనుంది. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. రాష్ట్రస్థాయిలోని కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని