Road Accident: పుష్ప-2 షూటింగ్‌ నుంచి వస్తుండగా ప్రమాదం

పుష్ప-2 సినిమా ఆర్టిస్టులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పరిధిలోని విజయవాడ-హైదరాబాద్ హైవేపై చోటుచేసుకుంది. 

Updated : 31 May 2023 09:29 IST

నార్కట్‌పల్లి గ్రామీణం: పుష్ప-2 సినిమా ఆర్టిస్టులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పరిధిలోని విజయవాడ-హైదరాబాద్ హైవేపై చోటుచేసుకుంది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణాలతో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని జాతీయ రహదారి పక్కన నిలిపారు. బుధవారం తెల్లవారుజామున పుష్ప-2 సినిమా ఆర్టిస్టులతో  శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు ట్రావెల్‌ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సులో ఉన్న సినిమా ఆర్టిస్టుల్లో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా  షూటింగ్‌ ముగించుకొని హైదరాబాద్‌కు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని