ఏపీలో రూ.6400కోట్ల టెండర్లు రద్దు

ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రూ.6400 కోట్లతో 3వేల కి.మీల మేర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు చేస్తూ.. మరోసారి టెండర్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో మళ్లీ టెండర్లు .....

Updated : 17 Oct 2022 14:18 IST

అమరావతి: ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. రూ.6400 కోట్లతో 3వేల కి.మీల మేర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన సర్కార్‌.. మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. వారంలో మళ్లీ టెండర్లు పిలిచి.. 45 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. టెండర్ల దాఖలులో ఎవరూ భయాందోళనకు గురికాలేదని.. ఎక్కువ విలువైన పనుల్లో గుత్తేదార్లు తక్కువగా పాల్గొంటారని చెప్పారు. ఎన్డీబీ ద్వారా చేపట్టిన పనులను 26  ప్యాకేజీలుగా పిలిచామనీ.. మరింత మందికి అవకాశం కల్పించేందుకే రీటెండర్లు పిలిచినట్టు స్పష్టంచేశారు. ఈ టెండర్లపై తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే రీటెండర్లకు పిలుస్తున్నామన్నారు.

రోడ్ల నిర్మాణం జాప్యమైనా పర్వాలేదని సీఎం చెప్పారని తెలిపారు. గుత్తేదార్లతో సమావేశాలు నిర్వహిస్తామని, బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదని తెలిపారు. ప్రతి టెండర్‌ ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకే నిర్వహిస్తున్నట్టు కృష్ణబాబు చెప్పారు. గుత్తేదారులకు పనుల అప్పగింతలో ఆర్థిక అర్హతలు బేరీజు వేస్తామన్నారు. ఈ- టెండర్‌ దాఖలు చేసినా హార్డ్‌ కాపీలు ఇవ్వాలని సూచించామని తెలిపారు. సెప్టెంబర్‌తో సమయం ముగిసినా కేంద్రాన్ని మరింత గడువు కోరినట్టు చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని