AP News: ఏపీలో రూ.50 కోట్లతో రహదారి భద్రతా నిధి..

రహదారి భద్రత కోసం రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Updated : 27 Sep 2023 16:36 IST

అమరావతి: రహదారి భద్రత కోసం రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారి ప్రాజెక్టుల అంచనాలో 2 శాతం రహదారి భద్రతా నిధికి జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో రహదారి భద్రతా అంశంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో జంక్షన్‌లను మెరుగుపర్చి, బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని సూచించారు. 

అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారికి సీటు బెల్టు వాడకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు ఇచ్చారు. మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్ధనా మందిరాల పరిసరాల్లో ప్రమాదాల నివారణకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి ప్రమాదకరమైన హోర్డింగ్లు, ఫ్లెక్సీల తొలగింపునకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని