రోబో గీసిన చిత్రానికి కాసుల వర్షం

కృత్రిమ మేథతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా తాజాగా డిజిటల్‌ ఆర్టిస్ట్‌గా మారింది. ఇప్పటికే మ్యుజీషియన్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, గాయకురాలిగా, మోటివేటర్‌గా పేరుగాంచిన సోఫియా ఇప్పుడు ఆకట్టుకునే చిత్రాలను గీస్తూ....

Updated : 24 Nov 2022 15:10 IST

ఏడు లక్షల డాలర్లు పలికి సోఫియా చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేథతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా తాజాగా డిజిటల్‌ ఆర్టిస్ట్‌గా మారింది. ఇప్పటికే మ్యుజీషియన్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, గాయకురాలిగా, మోటివేటర్‌గా పేరుగాంచిన సోఫియా ఇప్పుడు ఆకట్టుకునే చిత్రాలను గీస్తూ ఆశ్చర్యపరుస్తోంది. సోఫియా గీసిన ఓ చిత్రం నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ)లో ఏడు లక్షల డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 

హాంకాంగ్‌కు చెందిన హాన్సన్‌ రోబోటిక్‌ సంస్థ తయారుచేసిన హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా.. ఇటలీ డిజిటల్‌ ఆర్టిస్ట్‌ ఆండ్రియా బొనాస్సిటో వద్ద మెళకువలు నేర్చుకొని ప్రపంచ ప్రముఖుల చిత్రాలను గీస్తోంది. సోఫియా గీసిన చిత్రాలను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో వేలం వేస్తున్నారు. ఈ చిత్రాలను డిజిటల్‌ సంతకంలా బ్లాక్‌ చెయిన్‌ లెడ్జెర్స్‌లో భద్రపరుస్తారు. వేలంలో సోఫియా చిత్రాన్ని కొన్నవారికి అధికారిక హక్కులు ధ్రువీకరిస్తారు.

సోఫియా చిత్రకళకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ రోబో వేసిన ఓ చిత్రం సుమారు ఏడు లక్షల డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. కృత్రిమ మేథస్సుతో రూపొందించిన చిత్రాన్ని వేలం వేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. సోఫియా చిత్రాన్ని సోఫియా ఇన్‌స్టాంటియేషన్‌ అని పిలుస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ నెట్‌వర్క్స్‌, జెనెటిక్‌ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి తాను చిత్రాలను గీస్తున్నానని సోఫియా వెల్లడించింది. తన చిత్రకళను ప్రపంచం ఆస్వాదిస్తుందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని