Ts News: భువనగిరి ఖిల్లాపై సాహస క్రీడలు
భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో 'జిప్ లైన్' అనే మరో సాహస క్రీడ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. కొత్తగా జిప్ లైన్‌పై ట్రయల్స్ జరుగుతున్నాయి....
జిప్ లైన్ కోసం ట్రయల్ రన్ నిర్వహణ
భువనగిరి: భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో 'జిప్ లైన్' అనే మరో సాహస క్రీడ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. కొత్తగా జిప్ లైన్‌పై ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ సాహస క్రీడ ద్వారా పర్యాటకులు చక్కని అనుభూతి పొందనున్నారు. ప్రస్తుతం కోట మధ్యలో ఉన్న రెండు చిన్న కొండలకు తీగ మార్గాన్ని అనుసంధానం చేశారు. దీన్ని జిప్ లైన్ అని పిలుస్తారు. రాక్ క్లైంబింగ్ స్కూల్, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వారంరోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జిప్ లైన్ నిర్మాణ పనులను అహ్మదాబాద్‌కు చెందిన ఓ బృందం పూర్తిచేసింది. మరికొన్ని రోజుల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఖిలా మధ్యభాగంలో ఇరువైపులా ఉన్న ఎత్తయిన గుట్టలకు తీగను అనుసంధానించి జిప్ లైన్ ఏర్పాటు చేశారు. రెండు వైపులా బండరాళ్లను లోతుగా తొలచి తీగను బిగించారు. సుమారు 120 మీటర్ల పొడవుగల తీగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక పర్యాటకశాఖ నుంచి ధ్రువీకరణ పొందిన అనంతరం పర్యాటకులను అనుమతించనున్నారు. జిప్ లైన్ నిర్వహించేందుకు ఇప్పటికే రాక్ క్లైంబింగ్ స్కూల్లోని ఐదుగురు శిక్షకులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. గతంలో ఎవరెస్టును అధిరోహించిన పూర్ణ, ఆనంద్ తొలుత ఇక్కడే రాక్ క్లైంబింగ్ స్కూల్లో ప్రాథమిక శిక్షణ తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!