Nellore: నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా వద్ద రొట్టెల పండుగ మంగళవారం ప్రారంభమైంది.

Updated : 09 Aug 2022 14:07 IST

నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా వద్ద రొట్టెల పండుగ మంగళవారం ప్రారంభమైంది. ఈనెల 13వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పండుగకు కుల మతాలకు అతీతంగా ప్రపంచం నలుమూలల నుంచి భారీగా తరలి వస్తున్నారు. భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావారణం నెలకొంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని