RRB Group D Result: ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి(ఆర్‌ఆర్‌సీ 01/2019)(RRB Group D Result) పరీక్ష ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే భోపాల్‌, గువాహటి జోన్ల ఫలితాలు విడుదల కాగా..  సికింద్రాబాద్‌ సహా మిగతా జోన్ల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Updated : 22 Dec 2022 19:28 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి(ఆర్‌ఆర్‌సీ 01/2019)(RRB Group D Result) పరీక్ష రాసి, రిజల్ట్‌ కోసం నిరీక్షిస్తోన్న లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(RRB) గురువారం విడుదల చేసింది. ఫలితాలను సంబంధిత ఆర్‌ఆర్‌బీలు తమ అధికారిక వెబ్‌సైట్లలో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్‌, భోపాల్‌, గువాహటి జోన్ల ఫలితాలు విడుదల కాగా.. మిగతా జోన్ల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023, జనవరిలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు)కు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్‌ఆర్‌బీలు త్వరలో వెల్లడించనున్నాయి. ఎంపిక ప్రక్రియపై తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని రైల్వే శాఖ సూచించింది.

సికింద్రాబాద్‌ జోన్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా.. దాదాపు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో రైల్వే శాఖ నిర్వహించింది. అక్టోబర్‌లో ఈ పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్‌ విడుదల చేశారు. గ్రూప్‌-డి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది ఇప్పటికే పూర్తయింది. దీని తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు పీఈటీకి అర్హత సాధించాలంటే కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోరు సాధించాల్సి ఉంటుంది. అనంతరం వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

గమనిక: జోన్ల వారీగా ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో సంబంధిత ఆర్‌ఆర్‌సీ వెబ్‌సైట్‌లో వివరాలు చెక్‌ చేసుకోగలరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని