వామ్మో! 3 బల్బులు.. రూ.25 వేలు కరెంటు బిల్లు

సాధారణంగా కరెంటుబిల్లు మనం వాడుకున్న దానికి తగ్గట్టు వస్తుంది. యూనిట్ల ఆధారంగా చార్జీ వేస్తారు. కానీ, తమిళనాడులోని ఓ వృద్ధురాలికి మాత్రం 3 బల్బులు వాడుకుంటే ఏకంగా రూ.25వేల కరెంట్ బిల్‌ వచ్చింది.

Published : 22 Apr 2022 01:14 IST

చెన్నై:  సాధారణంగా కరెంటుబిల్లు మనం వాడుకున్న దానికి తగ్గట్టు వస్తుంది. యూనిట్ల ఆధారంగా చార్జీ వేస్తారు. కానీ, తమిళనాడులోని ఓ వృద్ధురాలికి మాత్రం 3 బల్బులు వాడుకుంటే ఏకంగా రూ.25వేల కరెంట్ బిల్‌ వచ్చింది. ఆమెకే కాదు ఆ ప్రాంతంలో నివసించే అందరికీ వాడుకున్న దాని కంటే ఎక్కువగానే బిల్లు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నీల్‌గిరిస్‌ జిల్లా మఠమగళం ప్రాంతంలో  దేవకి అనే వృద్ధురాలు చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. కేవలం మూడు బల్బులు మాత్రమే వాడే ఆమెకు ఈ నెల కరెంటు బిల్లు రూ.25వేలు కట్టాలంటూ మెస్సేజ్ వచ్చింది. దీంతో కంగుతిని ఎలక్ట్రిసిటీ బోర్డును సంప్రదించింది. వారు స్పందించలేదు. అయితే అదే ప్రాంతం నుంచి ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో శాఖపరమైన విచారణ చేశారు. అప్పుడు అసలు విషయం తెలిసి అధికారులు నివ్వెరపోయారు. ఆ ప్రాంతంలో రీడింగ్‌ తీసే ఉద్యోగి రమేశ్‌ నకిలీ రీడింగ్‌లు తీసి నిర్వాసితులు చెల్లిస్తున్న అదనపు డబ్బును తన ఖాతాలో పడేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. అతనిని సస్పెండ్‌ చేసిన అధికారులు పూర్తి విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు