రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా...

Updated : 20 Jun 2021 18:48 IST

హైదరాబాద్‌: అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.

ఏపీలో కర్ఫ్యూ వేళలకు అనుగుణంగా

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు  సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈనేపథ్యంలో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. కర్ఫూ నిబంధనలకు అనుగుణంగా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా  ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో యాణించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

తెలంగాణ నుంచి కర్ణాటకకు..

కర్ణాటక నిబంధనలకు అనుగుణంగా రేపట్నుంచి టీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఉదయం 5గంటల నుంచి సాయత్రం 7గంటల వరకు మాత్రమే బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు టీఎస్‌ ఆర్టీసీ బస్‌ సర్వీసులు ఉంటాయి. కర్ఫ్యూ దృష్ట్యా శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు