శంషాబాద్‌ విమానాశ్రయంలో రబ్బరు షెడ్డు

విమానాల మరమ్మతుల కోసం శంషాబాద్‌ విమానాశ్రయంలో గాలి బుడగ లాంటి రబ్బరు షెడ్డు అందుబాటులోకి వచ్చింది. ఇన్‌ఫ్లేటబుల్‌ హ్యాంగర్‌గా పిలిచే ఈ గాలి బుడగ ఆసియాలోనే మొట్టమొదటిదని జీఎంఆర్‌ సంస్థ తెలిపింది....

Published : 25 Feb 2021 01:16 IST

శంషాబాద్‌: విమానాల మరమ్మతుల కోసం శంషాబాద్‌ విమానాశ్రయంలో గాలి బుడగ లాంటి రబ్బరు షెడ్డు అందుబాటులోకి వచ్చింది. ఇన్‌ఫ్లేటబుల్‌ హ్యాంగర్‌గా పిలిచే ఈ గాలి బుడగ ఆసియాలోనే మొట్టమొదటిదని జీఎంఆర్‌ సంస్థ తెలిపింది. ఇంజిన్‌ ల్యాండింగ్‌, గేర్‌ పునస్థాపనతో సహా పలు కార్యకలాపాలకోసం ఉపయోగించవచ్చని సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ఇన్‌ఫ్లేటబుల్‌ హ్యాంగర్‌ జీవితకాలం 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. దానిని ఎక్కడికైనా తీసుకెళ్లే వీలుంటుందని, ఇందుకు ఖర్చు కూడా తక్కువేనని వెల్లడించారు. పీవీసీతో చేసిన ఈ పాలిస్టర్‌ బేస్‌ హ్యాంగర్‌ మంటలను తట్టుకుంటుందని, దీని కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆటోమేటిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పర్యవేక్షించవచ్చని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు