చెట్లెక్కిన చదువులు

కరోనా వల్ల విద్యా వ్యవస్థ తీరుతెన్నులు మారిపోయాయి. సామూహికంగా తరగతులు

Updated : 07 Jul 2021 04:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వల్ల విద్యా వ్యవస్థ తీరుతెన్నులు మారిపోయాయి. సామూహికంగా తరగతులు నిర్వహించడానికి వీలులేకపోవడంతో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ఈ మార్పు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల కోసం ఎత్తైన చెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా కర్ణాటకలోని నమక్కల్ జిల్లా పెరపంచోళై, పెరియ గొంబాయ్ గ్రామాల్లోని విద్యార్థులు సిగ్నల్ కోసం ఎత్తైన చెట్లు ఎక్కి ఆన్ లైన్ పాఠాలు వింటున్నారు. పాఠాలు వినాలనే తపనతో విద్యార్థులు సాహసాలు చేస్తున్న వైనం జిల్లా కలెక్టరుకు చేరింది. దీంతో గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రేయ సింగ్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని