military operations: శునకాలకు పారాచూట్‌ శిక్షణ

యుద్ధ విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు శునకాలను పంపించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మిలిటరీ విధులు నిర్వహించే శునకాలకు పారాచూట్‌ శిక్షణ అందిస్తోంది....

Updated : 07 Dec 2022 22:01 IST

మాస్కో: యుద్ధ విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు శునకాలను పంపించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మిలిటరీ విధులు నిర్వహించే శునకాలకు పారాచూట్‌ శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణ తుది దశకు చేరుకుంది. టెక్నోడినామికా అనే ఏవియేషన్‌ హోల్డింగ్‌ సంస్థ ఈ శిక్షణనివ్వడంలో భాగస్వామి అయ్యింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్ధ విమానం ల్యాండ్‌ చేయలేని ప్రదేశాల్లో.. సైనిక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఓ సైనికుడితోపాటు అధికారిక శునకాన్ని పారాచూట్‌ సాయంతో కిందకు పంపించేందకు జరుగుతున్న సన్నాహాలు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించింది. శునకాలకు పారాచూట్‌ శిక్షణ ఇస్తున్న ఓ వీడియోను యూట్యూబ్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. హెలికాప్టర్‌ గాల్లో ఎగురుతుండగా.. శునకాలను పొట్ట భాగానికి కట్టుకొని సైనికులు పారాచూట్‌ సాయంతో కిందికు దిగుతున్న దృశ్యాలు అందులో కినిపిస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన పలు వివరాలను అధికారులు ఆ వీడియోలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని