Published : 26 Jun 2022 16:02 IST

Telangana News: 28నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు రూ.50,447.33 రైతుల ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు. రైతు బీమా పథకం ద్వారా 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4,150.90 కోట్లు పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు. సీజన్‌కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా 20లక్షల ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుతోపాటు పప్పు, నూనెగింజలు, కందులు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు, మినుములు, పెసర సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు వేదికలలో సమావేశాలతో పాటు, క్షేత్రస్థాయి పర్యటనలతో వ్యవసాయ అధికారులు రైతులను పంటల మార్పిడి దిశగా చైతన్యం చేయాలని ఆదేశించారు. రైతులతో వ్యవసాయ అధికారుల అనుబంధం మరింత పెరగాలని సూచించారు. వ్యవసాయ అధికారులతో పాటు అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు సంబంధించిన అన్ని సభలు, సమావేశాలకు రైతువేదికలను ఉపయోగించుకోవాలన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని