Hyd News: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో తిమ్మక్క.. సన్మానించిన సీఎం కేసీఆర్
కర్ణాటకకు చెందిన వృక్షమాత పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కను సీఎం కేసీఆర్ సన్మానించారు. ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను ప్రగతిభవన్‌లో ఘనంగా సత్కరించారు. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను
హైదరాబాద్: కర్ణాటకకు చెందిన వృక్షమాత పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కను సీఎం కేసీఆర్ సన్మానించారు. ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను ప్రగతిభవన్‌లో ఘనంగా సత్కరించారు. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులెవరూ లేరని కేసీఆర్ కొనియాడారు. ఆమె మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేసీఆర్ చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం ప్రకృతికి మేలు చేస్తుందని ఈ సందర్భంగా తిమ్మక్క చెప్పారు.
మరోవైపు ఎంపీ జోగినపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న తిమ్మక్క.. ప్రగతిభవన్‌లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆమె ఎంపీని ఆశీర్వదించారు. తన మొక్కల వారసత్వాన్ని కొనసాగిస్తున్న సంతోష్‌ను ప్రశంసించారు. తన 111వ పుట్టిన రోజు జూన్ 28న “తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్” ద్వారా అందిస్తున్న అవార్డును ఈ సంవత్సరం సంతోష్‌కు అందించనున్నట్లు తిమ్మక్క తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్