Telangana News: ఆ మూడు శాఖల్లోనే 72 వేల పోస్టుల భర్తీ: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో మొదట పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Updated : 20 Apr 2022 19:55 IST

హైదరాబాద్: తెలంగాణలో మొదట పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మూడు శాఖల్లో సుమారు 72 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయని చెప్పారు. ఒక ఉద్యోగం రాకపోతే మరో ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందన్నారు. 91 వేల ఉద్యోగాల ప్రకటన చేసేముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని పేర్కొన్నారు.

ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని యువత ఎదురు చూస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి వివరించారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాలను ఉన్నత విద్యా మండలి కార్యాలయం నుంచి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లోని శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు మెటీరియల్ కూడా ఉచితంగా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శ్రమ ఆయుధమైతే.. విజయం బానిస అవుతుందన్న స్ఫూర్తితో విద్యార్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించాలని మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని