
Sadhguru Jaggi Vasudev: దీపావళి టపాసులను బ్యాన్ చేయకండి!
ఇషా ఫౌండేషన్ స్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్
చెన్నై: దీపావళి పండుగ నాడు టపాసులను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. మరి కచ్చితంగా టపాసుల కాల్చివేతను ఆపేయాల్సిందేనా అనే విషయంపై ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సద్గురు తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘ కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచే దీపావళి రోజు టపాసులు పేల్చొచ్చని కలలు కనేవాళ్లం. పండుగ అయిపోయినా సరే!.. ఆ టపాసులను దాచుకొని మరో రెండు నెలలు రోజూ కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయుకాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయు కాలుష్యంపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులందరికీ నేనో ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నా. అదేంటంటే..ఈసారికి మీరు కాల్చడం మానేసి మీ పిల్లల్ని కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీస్‌కు కారులో కాకుండా మూడురోజుల పాటు నడిచి వెళ్లండి.’’ అంటూ ఓ వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఓ నెటిజన్ ఈవిషయాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ సద్గురూ! మీరు చెప్పింది నిజం. కాలుష్యానికి కారణమైన టాప్ 10లో కూడా దీపావళిని కారణంగా పేర్కొలేదు. బహుశా కొత్తగా వచ్చిన పర్యావరణ కార్యకర్తలు ఈ విషయాన్ని మర్చిపోయి ఉంటారు’’ అంటూ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: కెప్టెన్సీకి పంత్ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్ మాజీ క్రికెటర్
-
Politics News
Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్ రౌత్
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
-
Business News
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
-
Movies News
Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా మార్చారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
-
Sports News
Rohit Sharma: రోహిత్ ఆరోగ్యంపై సమైరా అప్డేట్.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
- నాకు మంచి భార్య కావాలి!
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్లో చూడొచ్చు
- ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లకు మంగళం