Published : 11 Dec 2021 17:51 IST

TTD: శ్రీవారికి నివేదించిన పుష్పాలతో అగర్‌బత్తీల తయారీ ఆగమశాస్త్రానికి విరుద్ధం: శ్రీనివాసానంద సరస్వతి

విశాఖపట్నం: తిరుమల శ్రీవారికి నివేదించిన పుష్పాలతో అగర్‌బత్తీల తయారీ.. ఆగమశాస్త్రానికి విరుద్ధమని సాధుపరిషత్  అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జంబో పాలకమండలి సహా తితిదేలో చోటుచేసుకుంటున్న వివాదాలే ప్రకృతి విపత్తుల రూపంలో బయటపడుతున్నాయని విశాఖపట్నంలో ఆయన వ్యాఖ్యానించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలు, దండలను తిరిగి వినియోగించకూడదని ఆగమశాస్త్రం చెబుతోందని వివరించారు. వాటిని ప్రవహించే నీటిలో వేయడం.. లేదా భూమిలో పాతిపెట్టడం లాంటివి చేయాలని శాస్త్రాల్లో వివరించినట్టు తెలిపారు.

Read latest General News and Telugu News


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని