Sajjala: సిట్‌ విచారణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: సజ్జల

రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Published : 03 May 2023 18:11 IST

అమరావతి: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిట్‌ విచారణ విషయంలో న్యాయస్థానం చూసిన దృష్టికోణం సరైందేనన్నారు. దేశంలోనే అతిపెద్ద భూముల స్కామ్‌ అమరావతిలోనే జరిగిందని ఆరోపించారు. శాసనసభ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశాక, సభలో చర్చించాకే సిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. స్టే తొలగడంతో రాజధాని భూములపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు సంతకంతో లేని సంస్థకు రూ.వందల కోట్లు పంపించారని రుజువైందన్న సజ్జల.. ఈ కేసులో చంద్రబాబు ఎప్పుడు అరెస్టవుతారనేది తేలాల్సి ఉందన్నారు. రాజధాని కేసులోనూ అరెస్టులు జరుగుతాయన్నారు. అరెస్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేసిందేమీ లేదని, భూసేకరణ పూర్తి చేయకుండా విమానాశ్రయం పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. మాజీ మంత్రి బాలినేని రాజీనామా వ్యవహారం వ్యక్తిగతమైందని, వ్యక్తిగత కారణాలతోనే ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని