AP PRC: అంతా అయ్యాక అలా మాట్లాడటం సరికాదు : సజ్జల

ఆర్థిక పరిస్థితి వల్ల ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇవ్వలేకపోయామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు...

Updated : 06 Feb 2022 16:15 IST

విజయవాడ: ఆర్థిక పరిస్థితి వల్ల ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇవ్వలేకపోయామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిన్నే చెబితే ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కరించే వాళ్లమన్నారు. హెచ్‌ఆర్‌ఏ వల్ల టీచర్లకు అన్యాయం జరిగిందని చెబితే సరిచేశామని, మినిట్స్‌ తయారయ్యాక బయటకు వెళ్లి మాట్లాడటం సరికాదని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. ఎవరూ అడగకపోయినా ఉద్యోగ విరమణ వయస్సును 62కు పెంచినట్లు సజ్జల గుర్తు చేశారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ‘చలో విజయవాడ’లోనూ ప్రభుత్వం ఉద్యోగులను ఏమీ అనలేదని, పవన్‌ అన్నట్లు ప్రభుత్వం ఎక్కడా ఆధిపత్య ధోరణి చూపలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని