Tirumala Brahmotsavam: ఆదిశేషునిపై అనంతశయనుడు

భువిపై వెలసిన కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Updated : 19 Sep 2023 06:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భువిపై వెలసిన కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. పెద్ద శేషు అంటే ఆదిశేషువు. నాగులలో అత్యంత శ్రేష్టుడు ఆదిశేషువు. అందుకే అన్నమయ్య ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము’ అని కీర్తిస్తాడు. అల వైకుంఠములో ఆదిశేషునిపై శయనించే శ్రీమహావిష్ణువు బ్రహ్మోత్సవాల తొలిరోజున ఆ వాహనంపై విహరించడం విశేషం. పెద్ద శేషవాహనంపై ఉన్న మలయప్పస్వామిని వీక్షిస్తే పాపాలు తొలగిపోతాయని కోట్లాదిమంది భక్తుల ప్రగాఢ విశ్వాసం.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు