HMDA: అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలో హెచ్‌ఎండీఏ ప్లాట్లు.. 121 గజాల నుంచి ప్రారంభం
హెచ్‌ఎండీఏ ల్యాండ్ ప్లాట్లను పారదర్శకంగా ఆన్‌లైన్ పద్ధతిలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ ప్లాట్లను మార్కె ధరకే ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు లోబడి హెచ్‌ఎండీఏ (HMDA)ల్యాండ్ ప్లాట్లను పారదర్శకంగా ఆన్‌లైన్ పద్ధతిలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించనుంది. ప్రస్తుతం 3 జిల్లాల పరిధిలో అవుటర్ రింగ్‌రోడ్డుకు దగ్గరలో అమ్మకానికి 39 ల్యాండ్ పార్సెల్స్ అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్‌పార్సెల్స్ కొనుగోలు దారుల కోసం సిద్ధంగా ఉంచారు. ప్లాట్లు ఉన్న ప్రాంతాలు (ల్యాండ్ పార్సిల్స్) కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం కల్పించారు. అందుబాటు ధరల్లో 121 గజాల నుంచి 10,164 గజాల వరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
ఏ యే ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయంటే?
రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలంలో 3, శేరిలింగంపల్లి మండలంలో 5, ఇబ్రహీంపట్నం మండలంలో రెండు చోట్ల ల్యాండ్ పార్సెల్స్ ఉండగా, మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో 4, ఘట్ కేసర్ మండలంలో ఒకటి, బాచుపల్లి మండలంలో ఒకటి చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండల పరిధిలో 16, ఆర్‌సీ పురం మండలంలో 6, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి ఒకటో తేదీన మొత్తం 39 ల్యాండ్ పార్సిల్స్ ను ఎంఎస్‌టీసీ ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోందని అధికారులు వెల్లడించారు. వంద శాతం ఎలాంటి చిక్కులు లేని, క్లియర్ టైటిల్ ఉన్న ఈ ల్యాండ్ పార్సెల్స్ ను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీలో రిజిస్ట్రేషన్(నమోదు) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన వారు ఫిబ్రవరి 28న సాయంత్రం 5గంటల లోపు నిర్దేశించిన ధరావత్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుందని హెచ్ఎండిఏ వెల్లడించింది.
రేపటి నుంచి ప్రీబిడ్ సమావేశాలు
హెచ్ఎండిఏ వేలం వేస్తున్న ల్యాండ్ పార్సిల్స్ పై కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 21న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22న సంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్ లో, 23న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న సర్కిల్ ఆఫీసులో ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివరాలను హెచ్ ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య