KCR: పూరీ తీరంలో కేసీఆర్‌ సైకత శిల్పం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఆయన సైకత శిల్పాన్ని పూరీ తీరంలో ఏర్పాటు చేశారు. తెరాస నేత అలిశెట్టి అర్వింద్‌ ఆధ్వర్యంలో సైకత శిల్పి సాహు దీనిని రూపొందించారు

Published : 04 Oct 2022 01:13 IST

భువనేశ్వర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ.. ఆయన సైకత శిల్పాన్ని పూరీ తీరంలో ఏర్పాటు చేశారు. తెరాస నేత అలిశెట్టి అర్వింద్‌ ఆధ్వర్యంలో సైకత శిల్పి సాహు దీనిని రూపొందించారు. 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటంతో తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని అర్వింద్‌ అన్నారు. అదే తరహాలో దేశ భవిష్యత్తును సైతం మార్చగల సత్తా ఆయనకు ఉందని కొనియాడారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. ఇప్పటికీ రైతులు, ఇతర వర్గాలు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారంటే అది భాజపా, కాంగ్రెస్‌ల పాలన వైఫల్యమేనని గుర్తించిన కేసీఆర్‌.. జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారని అర్వింద్‌ తెలిపారు. యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ దేశ గతిని సైతం మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. అద్భుతంగా తీర్చిదిన శిల్పాన్ని వీక్షించేందుకు పూరీలోని స్థానికులు పర్యాటకులు ఆసక్తి కనబరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని