ap news: కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వర ఆలయం

కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆలయ గోపురం

Updated : 24 Jul 2021 19:14 IST

శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది. ఆలయ పూజారి రఘురామశర్మ శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని