Hyd News: జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు

నగరంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని 

Updated : 09 May 2022 12:26 IST

హైదరాబాద్‌: నగరంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు బయోమెట్రిక్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద కార్మికులను పర్మినెంట్‌ చేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

వీటితో పాటు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కార్మికులు ధర్నా చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను నియంత్రించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని