సంక్రాంతి రద్దీ.. రేపు సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు‌

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ రద్దీగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా తాజాగా సికింద్రాబాద్‌

Updated : 10 Jan 2022 17:43 IST

సికింద్రాబాద్‌: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ రద్దీగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా తాజాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాత్రి 9గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న ఈ సువిధ ప్రత్యేక రైలు (నెం 82725) మరుసటిరోజు ఉదయం 9.50గంటలకు విశాఖ చేరుకోనుందని తెలిపింది. 

ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకెండ్ సీటింగ్‌ కోచ్‌లు ఉంటాయని తెలిపింది. ఈ రైలు సేవలు పూర్తిగా రిజర్వేషన్‌ చేయించుకున్నవారికేనని స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని