సంగీత విద్వాంసుడు పండిత్ శివకుమార్ శర్మ కన్నుమూత
ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ (84) మంగళవారం కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు పండిత్ శివకుమార్ శర్మ (84) మంగళవారం కన్నుమూశారు. తన ప్రత్యేక శైలితో సంతూర్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో భాగం చేయడమే కాకుండా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన ఆయన భారత ప్రభుత్వం నుంచి 1991లో పద్మశ్రీ , 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మృతికి సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.
‘‘పండిత్ శివకుమార్ మరణం సంగీత ప్రపంచానికి తీరనిలోటు. హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి ఆయన స్వరపరిచిన ‘శివ హరి’ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆయన కుటుంబానికి, విద్యార్థులకు, అభిమానులకు శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని తెలుపుతూ బాలీవుడ్ గాయకుడు విశాల్ డడ్లాని ట్విటర్లో పోస్ట్ చేశారు
‘‘మీరు లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అంటూ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM