‘టీకా’ సారంగదరియా పాట విన్నారా..?

కరోనా టీకాపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పట్టణం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యయుడు వినూత్న ప్రయోగం చేశారు. జానపద పాటను పేరడీగా మలిచి కొవిడ్‌ టీకాపై అవగాహన కల్పిస్తున్నారు. ‘సారంగదరియా’ పాటను పేరడీగా మలిచారు....

Published : 06 Apr 2021 01:41 IST

కమలాపూర్‌: కరోనా టీకాపై అవగాహన కల్పించేందుకు వరంగల్ అర్బన్‌ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యయుడు వినూత్న ప్రయోగం చేశారు. జానపద పాటను పేరడీగా మలిచి కొవిడ్‌ టీకాపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈమధ్య కాలంలో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ‘సారంగదరియా’ పాటను పేరడీగా మలిచారు కమలాపూర్‌ మండలం గూనిపర్తికి చెందిన రఘుపతి. సామాజిక బాధ్యతగా కొవిడ్‌ టీకాపై రాసిన పేరడీ పాట సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రతిఒక్కరు కొవిడ్‌ నిబంధలు పాటించాలని రఘుపతి సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని