2DG సమర్థంగా పనిచేస్తోంది: సతీష్‌రెడ్డి

కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ధి, ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి తెలిపారు..

Updated : 09 Jun 2021 12:40 IST

హైదరాబాద్‌: కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ధి, ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి తెలిపారు. 2డీజీ ఔషధంపై ఫెడరేషన్ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మధ్యస్త, తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా రోగులపై ప్రభావవంతంగా 2 డీజీ ఔషధం పనిచేస్తుందని, ఆక్సిజన్‌ వినియోగాన్ని తగ్గిస్తుందని సతీష్‌రెడ్డి వివరించారు.

 పైలట్‌ రక్షణ కోసం డీఆర్‌డీవో రూపొందించిన ఆన్‌బోర్డు ఆక్సిజన్‌ జనరేటింగ్‌ సిస్టమ్‌ను ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ తయారీ కోసం వినియోగించనున్నట్టు సతీష్‌రెడ్డి వెల్లడించారు.  ప్రధాని మోదీ సమీక్ష జరిపి దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఈ వ్యవస్థతో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారని తెలిపారు. ఆమేరకు జులై చివరి నాటికి 850 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే నెల నాటికి 2డీజీ ఔషధాన్ని విస్తృతంగా ఉత్పత్తి చేసి దేశంలోని ఆసుపత్రులకు తగినంత పంపిణీ చేస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈవో దీపక్‌ సప్రా తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని